వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS) కమ్యూనిటీ మెడిసిన్ విభాగం (Department of Community Medicine) ఆధ్వర్యంలో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం (National Pollution Prevention Day) సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బుధవారం బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డా॥ ఆర్.వి. కుమార్ (SVIMS Director and Vice-Chancellor) చేతుల మీదుగా మొత్తం 9 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ విషయాన్ని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు.
ఈ సందర్భంగా డా॥ ఆర్.వి.కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, 1984 డిసెంబర్ 2న జరిగిన భోపాల్ గ్యాస్ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం జాతీయ కాలుష్య నివారణ దినోత్సవాన్ని పాటిస్తామని తెలిపారు. ఈ ఏడాది జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం థీమ్ “సస్టైనబుల్ లివింగ్ ఫర్ ఎ గ్రీనర్ ఫ్యూచర్” (Sustainable Living for a Greener Future) అని పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ ఆరోగ్యాన్ని కాపాడేందుకు స్థిరమైన జీవన విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు.
కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా॥ నాగరాజ్ (Environmental Awareness) మాట్లాడుతూ, “పచ్చని భవిష్యత్తు కోసం స్థిరమైన జీవనం” అనే అంశంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం లక్ష్యమని తెలిపారు. గదిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు, ఏసీ వంటి విద్యుత్ పరికరాలను ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చని వివరించారు.
వ్యాసరచన పోటీల్లో
స్విమ్స్ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఎం.బి.బి.ఎస్. మూడవ సంవత్సరం విద్యార్థిని పి. ఉషశ్రీ, పిజియోథెరపీ కళాశాల బిపిటి మూడవ సంవత్సరం విద్యార్థిని సి. జీవనశ్రీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ కళాశాల ఎన్.పి.టి. రెండవ సంవత్సరం విద్యార్థిని పి. సనా ముష్కిన్లు ప్రథమ స్థానంలో నిలిచారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ నోడల్ ఫ్యాకల్టీ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డా॥ చంద్రశేఖర్, అసోసియేట్ ప్రొఫెసర్ డా॥ విశ్వేశ్వరరావు, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
#SVIMS
#EssayWritingCompetition
#PollutionPreventionDay
#SustainableLiving
#GreenFuture
#EnvironmentalAwareness
#CommunityMedicine