పునర్జన్మల నేపథ్యంతో ‘వృషభ’… విడుదలైన మధుర ప్రేమగీతం ‘చిన్ని చిన్ని..’
సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వృషభ’ (Vrushabha) ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. పునర్జన్మల నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు.
కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు. ఈ చిత్రానికి నందకిషోర్ దర్శకత్వం వహించగా, మలయాళం మరియు తెలుగులో తెరకెక్కించారు.
తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన బ్యూటీఫుల్ లవ్ సాంగ్ ‘చిన్ని చిన్ని..’ (Chinni Chinni Song) ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సమర్జీత్ లంకేష్, నయన్ సారికపై చిత్రీకరించిన ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి క్యాచీ లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి తన మధుర గానంతో ప్రేమ ఫీల్‌ను మరింత పెంచారు. ఈ పాటకు సామ్ సీఎస్ చార్ట్‌బస్టర్ ట్యూన్ అందించారు.
‘ఎవ్వరే నువ్వెవ్వరే చెప్పవే ఓ దేవత…’ అంటూ సాగుతున్న ఈ లవ్ సాంగ్ సినిమాలో భావోద్వేగాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పునర్జన్మల కథాంశం, హై టెక్నికల్ వ్యాల్యూస్, స్టార్ కాస్టింగ్‌తో విజువల్ వండర్గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుందని చిత్రయూనిట్ వెల్లడించింది.
#Vrushabha
#Mohanlal
#ChinniChinniSong
#ReincarnationTheme
#TeluguCinema
#MalayalamCinema
#SamCS
#EktaKapoor
#IndianCinema
#UpcomingMovie