గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ‘ఛాంపియన్’
స్వప్న సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న అప్‌కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ (Champion Movie) ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. రోషన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ (Zee Studios) సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ (Anandi Art Creations), కాన్సెప్ట్ ఫిల్మ్స్ (Concept Films) కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఈ సందర్భంగా చిత్రబృందం వైజాగ్‌లో గ్రాండ్‌గా ‘ఛాంపియన్ నైట్ ఈవెంట్ (Champion Night Event) నిర్వహించింది. ఈ ఈవెంట్లో హీరో రోషన్ మాట్లాడుతూ, దర్శకుడు ప్రదీప్ తన దగ్గర ఈ కథ తీసుకొచ్చిన క్షణమే ఈ సినిమా తప్ప మరో సినిమా చేయనని నిర్ణయించుకున్నానన్నారు. ప్రదీప్ విజన్‌ను నిర్మాత స్వప్న మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని తెలిపారు. పీరియడ్ సినిమాల్లో ఆమెకు ఉన్న అనుభవమే ఈ చిత్రానికి బలమని చెప్పారు. ట్రైలర్ విడుదలైన తర్వాత, ఎడిట్ చూసిన తర్వాత ఈ సినిమా 100 శాతం హిట్ అవుతుందనే నమ్మకం వచ్చిందని వెల్లడించారు.
హీరోయిన్ అనస్వర రాజన్ మాట్లాడుతూ, తెలుగులో విడుదలవుతున్న తన తొలి సినిమా ఇదేనని తెలిపారు. దర్శకుడు ప్రదీప్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ నెల 25 తర్వాత రోషన్‌ను ప్రేక్షకులు మరింత ప్రేమిస్తారని అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర పేరు చంద్రకళ అని, ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తానని చెప్పారు.
నిర్మాత ఊహ మాట్లాడుతూ, రోషన్ మూడేళ్లు ఎదురుచూశారని, ఆ నిరీక్షణకు సమాధానమే ఈ సినిమా అని అన్నారు. మైఖేల్ పాత్రలో రోషన్‌కు అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రదీప్‌కు ధన్యవాదాలు తెలిపారు. చిన్ననాటి నుంచీ రోషన్‌ను చూసిన తమ సంస్థలోనే అతని రీలాంచ్ జరగడం ఆనందంగా ఉందన్నారు.
ఈ వేడుకలో రామ్ మిరియాల, కాసర్ల శ్యామ్, రచ్చ రవి తదితరులు పాల్గొని ‘ఛాంపియన్’ (Champion Telugu Movie) ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
#ChampionMovie
#ChampionTelugu
#Roshan
#AnaswaraRajan
#PradeepAdvaitham
#ZeeStudios
#TeluguMovies
#UpcomingTeluguMovie
#ChampionRelease