తిరుపతి ప్రజలకు ఇన్ని కష్టాలా? దేవుడా.!
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) లో వచ్చిన 412 అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులు ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వేదికలో అర్జీదారులను గౌరవంగా స్వాగతించి త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్, ఇతర అవసరమైన సదుపాయాలను కల్పించి వారి సమస్యలను శ్రద్ధగా వినారు.
ప్రతి వారం తిరుపతి కలెక్టరేట్లో వచ్చే అర్జీల్లో సోమవారం రికార్డు స్థాయిలో ప్రజలు విన్నపాలను సమర్పించుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారుల ఎదుట మొరపెట్టుకున్నారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని అనేక సమస్యలు కలెక్టర్ కు తీసుకొచ్చినట్లు అర్జీదారులు చెబుతున్నారు. అయితే గ్రామ, మండల స్థాయిలో అధికారుల్లో అదే నిర్లక్ష్య దోరణి కనిపిస్తోందని పలువురు మండిపడ్డారు. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యలకు తగిన పరిష్కారం చూపాలని కోరారు.
జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించిన సందర్భంగా వేగవంతంగా పరిష్కారం చూపాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజ్ మాండ్ అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వినతులను ఆన్లైన్లో నమోదు చేసి సిబ్బందికి రసీదులు అందజేశారు.
విభాగాల వారీగా అర్జీలు:
రెవెన్యూ: 201
పంచాయతీరాజ్: 57
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్: 18
సెకండరీ హెల్త్: 1
గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ: 13
జల వనరుల శాఖ: 7
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్: 2
హోమ్: 30
ఆర్ అండ్ బి: 1
గిరిజన సంక్షేమ శాఖ: 5
రిజిస్ట్రేషన్ శాఖ: 2
గనులు మరియు భూగర్భ జలాల శాఖ: 4
సర్వే శాఖ: 14
జాతీయ రహదారులు: 1
సివిల్ సప్లైస్: 5
మాతా శిశు సంక్షేమ శాఖ: 1
ఫ్యామిలీ వెల్ఫేర్: 12
హౌసింగ్: 10
ఏపీ ఐఐసీ: 1
కాలుష్య నియంత్రణ బోర్డు: 1
ఐ అండ్ పి ఆర్: 1
పశు సంవర్థక శాఖ: 1
మెప్మా: 1
తుడా: 1
రూరల్ డెవలప్మెంట్: 2
మైనారిటీ వెల్ఫేర్: 1
స్కిల్ డెవలప్మెంట్: 2
ఎస్.వి. యూనివర్సిటీ: 1
విద్యుత్ శాఖ: 2
ఎక్సైజ్ శాఖ: 3
పాఠశాల విద్యాశాఖ: 3
వ్యవసాయ శాఖ: 4
కో-ఆపరేటివ్ సొసైటీస్: 2
రుయా: 1
ఎండోమెంట్: 1
జిల్లా కలెక్టర్ అందరి అధికారులు ఈ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని, ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చూపరాదు అని స్పష్టంగా ఆదేశించారు.