శ్రీహరికోట నుంచి ఇస్రో ‘బాహుబలి’గా పేరుగాంచిన LVM–3 రాకెట్ ఈ నెల 24న తన ఆరో స్పేస్ ట్రిప్‌కు సిద్ధమైంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన 6,100 కిలోల భారీ ‘బ్లూ బర్డ్ బ్లాక్–2’ శాటిలైట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టే ఈ మిషన్‌కు ఆదివారం తుది రిహార్సల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇస్రో ఛైర్మన్ నారాయణన్ సోమవారం మిషన్ రెడీనెస్ రివ్యూ నిర్వహించనున్నారు.
ఇప్పటివరకు భారత్ లాంచ్ చేయనున్న అత్యంత బరువైన కమర్షియల్ పేలోడ్ ఇదే కావడం విశేషం. ఈ ప్రయోగం సక్సెస్ అయితే అంతరిక్షం నుంచే మొబైల్ నెట్‌వర్క్ సేవల లక్ష్యంతో రూపొందిన శాటిలైట్‌కు మార్గం సుగమమవడంతో పాటు, ఇస్రోకు అత్యంత లాభదాయకమైన అంతర్జాతీయ కమర్షియల్ డీల్‌గా నిలవనుంది. అంతేకాకుండా భారీ పేలోడ్లను నమ్మకంగా కక్ష్యలో ప్రవేశపెట్టగల సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటే అవకాశం భారత్‌కు దక్కనుంది.