
రష్యాలోని సైబీరియా (Siberia) అడవుల్లో విమానం ఒకటి అదృశ్యమైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ విమానంలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. రష్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ Rosaviatsia ఈ విషయాన్ని వెల్లడించింది.
అంతర్జాతీయంగా Antonov An-2గా ప్రసిద్ధి పొందిన ఈ సింగిల్ ఇంజిన్ బైప్లేన్ (single-engine biplane) విమానం సాధారణంగా వ్యవసాయ మరియు అటవీ కార్యకలాపాలకు వాడబడుతుంది. ఇది యాకుతియా అడవుల మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి డిస్ట్రెస్ సిగ్నల్ (distress signal) పంపించి మిస్సింగ్ అయింది.
TASS న్యూస్ ఏజెన్సీ ప్రకారం, రష్యా అత్యవసర సేవల శాఖ దీనిపై స్పందించి, విమానాన్ని గుర్తించేందుకు సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ (search and rescue operation) ప్రారంభించిందని తెలిపింది. Rosaviatsia టెలిగ్రామ్ వేదికగా చేసిన ప్రకటనలో, ఈ విమానం అటవీ ప్రాంతాల్లో గగన విహారాన్ని (forestry aerial reconnaissance) చేపడుతుండగా అనుకోని పరిస్థితుల కారణంగా కనపడకుండా పోయిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు సంఘటనా ప్రదేశాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఘటనా ప్రాంతం అతిపెద్ద మంచు అడవులతో చుట్టుముట్టి ఉండటంతో రేస్క్యూ కార్యకలాపాలు కష్టతరంగా మారినట్లు సమాచారం.