
- చంద్రబాబు దుర్వినియోగ పాలన
ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలనకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అయ్యారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని కుంచిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును తాను చేయని వ్యాఖ్యలపై అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
“ఒక డిబేట్‌లో వక్తలు చేసే మాటలకు యాంకర్‌కి సంబంధమేంటి? మీడియా గళం ఆపాలన్న కుట్రలో భాగంగానే ఈ అరెస్టు జరిగింది,” అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా కొమ్మినేనిని ఉద్యోగం నుంచి తొలగించడం, unbiased discussionsకి అడ్డంకులు పెట్టడం చంద్రబాబు కక్షసాధింపులనే చూపుతున్నాయని చెప్పారు.
“ఇది విలేకరులపై దాడి మాత్రమే కాదు… ప్రజాస్వామ్యంపై దాడి. మీడియా స్వేచ్ఛపై మరో బలమైన దెబ్బ,” అని మాజీ సీఎం అన్నారు. చంద్రబాబుకు ఐదేళ్ల అధికారమే ఇచ్చారనీ, ఏడాది గడిచిపోయిందనీ, మిగిలిన నాలుగేళ్లలో ప్రజలు ఆయన పాలనకు గుణపాఠం చెబతారని హెచ్చరించారు.