జమ్ము: జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఉగ్రదాడుల క్రమంగా పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. తాజాగా బారాముల్లాలో ఆర్మీ వాహనంపై గురువారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరితోపాటు ఇద్దరు కూలీలు మరణించగా, మరో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. బారాముల్లాలోని బుటాపత్రి నాగిన్ ప్రాంతంలో సామాగ్రి తీసుకెళ్తున్న మిలటరీ ట్రక్కుపై గురువారం సాయంత్రం ఉగ్రవాదులు తొలుత దాడులు జరిపినట్లు ఆర్మీ అధికారులు ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.18వ రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన సైనికుల కూడా కాల్పులు జరిపారు. గాయపడిన వ్యక్తిని ప్రీతమ్ సింగ్ గుర్తించారు. సంఘటనా ప్రాంతాన్ని భారత బలగాలు ఆధీనంలో తీసుకొని టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పాకిస్తాన్ సరిహద్దులకు కేవలం 5 కి.మీ దూరంలో ఈ సంఘటన జరిగింది. ఇది పాక్ ప్రేరేపిత చర్యగా భారత దేశం భావిస్తోంది. ఈ దాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ‘ఉత్తర కాశ్మీర్లోని బూటా పత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై దాడి జరగడం, ప్రాణ నష్టం కలగడం దురదృష్టకరం. కశ్మీర్లో ఇటీవల జరుగుతున్న వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.