న్యూఢిల్లీ, జూన్ 5 : దేశంలో కోవిడ్ మళ్లీ ప్రభావం చూపుతోంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ (Ministry of Health and Family Welfare) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూన్ 5, 2025 నాటికి 4,302 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరోజే 276 కొత్త కేసులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. కాగా, ఇటీవలి కాలంలో మొత్తం 44 మంది మృతి చెందినట్లు సమాచారం.
ఇప్పటి వరకు నమోదైన ఏడుగురు మరణాలు రాష్ట్రాలవారీగా ఇలా ఉన్నాయి. ఢిల్లీలో (Delhi) 22 ఏళ్ల యువతి శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్ (Lower Respiratory Tract Infection), కోవిడ్ న్యూమోనియా (COVID Pneumonia) కారణంగా ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలో (Maharashtra) గత 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. వారిలో గుండె సంబంధిత వ్యాధులు (Cardiac Arrythmia), పార్కిన్సన్, మధుమేహం (Diabetes Mellitus), హైపర్‌టెన్షన్ (Hypertension), ఆల్కహాల్ విత్‌డ్రావల్ తదితర కారణాలు ఉన్నాయి.
తమిళనాడులో (Tamil Nadu) 76 ఏళ్ల వృద్ధుడు ARDS, COVID Pneumonia, MODS వలన మృతి చెందాడు. గుజరాత్ (Gujarat)లో ఒక మరణం నమోదైంది కానీ పూర్తి వివరాలు ఇంకా లేవు. ఈ ఏడుగురు మృతుల వివరాలు దేశంలో కోవిడ్ మళ్లీ తలెత్తుతోందని హెచ్చరిస్తున్నాయి.
ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. ఆక్సిజన్ (Oxygen), వెంటిలేటర్లు (Ventilators), అవసరమైన మందులు (Essential Medicines) అందుబాటులో ఉండేలా ఆరోగ్య రంగంలో సన్నద్ధత పెంచాలని కేంద్రం (Centre) ఆదేశించింది. జనవరి 1 నుండి ఇప్పటివరకు 3,281 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు, మరో 581 మందిని గత 24 గంటల్లో రికవరీ లిస్టులో చేర్చారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.