April 17, 2026

వైసీపీ నేతలు జోకర్లుగా మారారు: మహిళా బిల్లుపై ఎమ్మెల్యే గౌతు శిరీష ధ్వజం!

GOWTHU SIRISHA

GOWTHU SIRISHA

అమరావతి: దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై హర్షం వ్యక్తమవుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మండిపడ్డారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ మంత్రి విడుదల రజిని చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. “నిన్నటి వరకు విలన్లుగా ఉన్న జగన్ బ్యాచ్, ఇప్పుడు మాటలతో జోకర్లుగా మారారు” అని ఆమె ఎద్దేవా చేశారు.

ఆ ఘనత వైఎస్‌ జగన్‌దే: విడదల రజిని కీలక వ్యాఖ్యలు.. ‘Vidadala Rajini On YS Jagan’ ఈ వార్తను కూడా చదవండి

నేరాల్లో ఏపీ అగ్రస్థానం – ఎన్సీఆర్బీ గణాంకాలు విడుదల రజిని గూగుల్ ఓపెన్ చేసి ఎన్సీఆర్బీ (NCRB) నివేదిక చూడాలని శిరీష సూచించారు. జగన్ ఐదేళ్ల పాలనలో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులను దాటి ఏపీని నేరాల్లో నంబర్ వన్ చేసిన ఘనత వైసీపీదేనని ఆరోపించారు. ముఖ్యంగా దళితులపై అకృత్యాలు జరగడంలో ఏపీ టాప్ పొజిషన్‌లో ఉందని, ఇది జగన్ రెడ్డి గారి ‘ఆస్కార్ స్థాయి నటన’కు నిదర్శనమని విమర్శించారు. డాక్టర్ సుధాకర్ వంటి దళిత మేధావులను వేధించి చంపిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదని గుర్తుచేశారు.

మహిళా పక్షపాతి ఎవరో లోకానికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్లు రాకముందే డ్వాక్రా సంఘాల ద్వారా కోటి మంది మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించారని, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను మహారాణులను చేశారని శిరీష కొనియాడారు. దీనికి భిన్నంగా, అమరావతికి భూములిచ్చిన ఆడబిడ్డలను నడిరోడ్డుపై ఈడ్చిన చరిత్ర జగన్ రెడ్డిదని ధ్వజమెత్తారు. సొంత తల్లిని, చెల్లిని గౌరవించని వ్యక్తి, ఆస్తి కోసం వారిని బయటకు గంటేసిన వ్యక్తి మహిళా పక్షపాతి ఎలా అవుతారని ఆమె ప్రశ్నించారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలు మహిళా నేతలపై పెట్టిన అశ్లీల పోస్టులే వారి సంస్కారానికి నిదర్శనమని, ఈ అరాచకాలను మహిళా లోకం ఎన్నటికీ క్షమించదని గౌతు శిరీష స్పష్టం చేశారు.

News Article (English)

Amaravati: Palasa MLA Gouthu Sireesha launched a scathing attack on the YSRCP leadership, labeling them as “jokers” for their criticism of the Women’s Reservation Bill 2026. Speaking at the TDP central office, she countered former minister Vidadala Rajini’s claims and highlighted the grim reality of women’s safety during Jagan Mohan Reddy’s five-year tenure.

Crime Capital Under Jagan’s Rule Citing the National Crime Records Bureau (NCRB) reports, Sireesha pointed out that Andhra Pradesh topped the list in crimes and atrocities under the previous government. She remarked that while Jagan Mohan Reddy portrays himself as a brother to Dalits, the statistics show a different story, with AP ranking first in crimes against SCs and STs in South India. “The distance between Chandrababu Naidu’s balanced governance and Jagan’s chaotic rule is vast,” she added.

Assault on Women’s Dignity Sireesha reminded the public of the harsh treatment meted out to the women of Amaravati, who were harassed and dragged onto the streets for protesting peacefully. She questioned Jagan’s credibility as a supporter of women, noting his legal and personal disputes with his mother and sister over property. “A leader who couldn’t respect his own blood siblings cannot claim to protect the women of the state,” she stated. She also condemned the YSRCP’s social media wing for its derogatory posts against women leaders from TDP and Janasena, asserting that the current alliance government is committed to restoring the self-respect and safety of women in Andhra Pradesh.

#GouthuSireeshaOnWomenReservationBill #TDP #YSRCP #WomensReservationBill2026 #NaraChandrababuNaidu #JaganMohanReddy #AmaravatiWomen #NCRBReport #APPolitics #WomenEmpowerment #PoliticalWar

ఆ ఘనత వైఎస్‌ జగన్‌దే: విడదల రజిని కీలక వ్యాఖ్యలు.. ‘Vidadala Rajini On YS Jagan’ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *