April 13, 2026

ఆయిల్‌ సంక్షోభం: ప్రపంచానికి ముప్పు

CRUDE OIL

CRUDE OIL

అమెరికా-ఇరాన్‌ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 21 గంటల సుదీర్ఘ చర్చల్లో ఎటువంటి ఒప్పందం కుదరకపోవడంతో, రెండు వారాల కాల్పుల విరమణ ముగిసిపోయి పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడే అవకాశం కనిపిస్తోంది. ఈ వైఫల్యం కేవలం రెండు దేశాలకే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే భారీ ఇంధన సంక్షోభానికి దారితీసేలా ఉంది.

ఇరాన్ కోలుకోలేని స్థితిలో ఉంది: ట్రంప్ ఈ వార్తను కూడా చదవండి

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ తన పట్టు బిగించే అవకాశం ఉంది. ఒకవేళ ఇరాన్‌ ఈ మార్గాన్ని మూసివేస్తే, అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఊహించని స్థాయికి చేరుకుంటాయి. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఈ పరిణామాలు చివరకు ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

చర్చల విఫలం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరింత కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇరాన్‌ తన నిబంధనలకు లొంగకపోతే, ఆ దేశ నౌకలు రేవుల నుంచి కదలకుండా ‘నౌకాదళ దిగ్బంధనం’ అస్త్రాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించారు. గతంలో వెనిజులాపై ప్రయోగించి సక్సెస్ అయిన ఈ వ్యూహాన్ని ఇప్పుడు ఇరాన్‌పై అమలు చేస్తే, ఆ దేశ ఆర్థిక మూలమైన చమురు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోతాయి. ఇది ఇరాన్‌తో పాటు భారత్, చైనా వంటి దిగుమతి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఇరాన్‌కు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేస్తోందనే ఆరోపణలపై చైనాను కూడా ట్రంప్ హెచ్చరించారు. బీజింగ్‌పై 200% టారిఫ్‌లు విధిస్తామని, వినాశకర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. మరోవైపు హర్మూజ్‌ను 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్‌ విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టేస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ యుద్ధం లెబనాన్, సిరియా వంటి దేశాలకు విస్తరించి, హూతీలు, హెజ్‌బొల్లాలు రంగంలోకి దిగితే పశ్చిమాసియా రణరంగంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

#OilCrisis #USIranWar #HormuzStrait #GlobalEconomy #TrumpWarnings #EnergyCrisis #PetrolPrice #InternationalNewsTelugu

ఇరాన్ కోలుకోలేని స్థితిలో ఉంది: ట్రంప్ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *