April 6, 2026

Kukatpally Gangrape : ప్రేమ పేరుతో పెళ్లి.. మొదటి రాత్రే గ్యాంగ్ రేప్!

Kukatpally gang rape

Kukatpally Gangrape :హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాలయముడిగా మారి, తన స్నేహితులతో కలిసి భార్యపై Gangrape కు పాల్పడిన ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. బాధితురాలు మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో ఈ అఘాయిత్యం బయటపడింది.

నవాజ్ అనే యువకుడు షాపు అద్దెకు తీసుకునే క్రమంలో మహిళతో పరిచయం పెంచుకుని, ఆపై ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. నవదుర్గగా పేరు మార్చుకుని 2025లో ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లయిన మొదటి రోజే తన క్రూరత్వాన్ని ప్రదర్శించి, నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై Sexual Assault కు ఒడిగట్టాడు.

మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడు ఆమె పేరు మీద ఉన్న ఫ్లాట్, బంగారంపై లోన్లు తీసుకుని ఉడాయించాడని సమాచారం. విచారణలో అతను అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది.

ప్రస్తుతం నిందితుడు నవాజ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు తనకు న్యాయం చేయాలని, తనను ముంచిన కేటుగాడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను మరియు ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఈ ఘటనపై Kukatpally Police కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.


English Summary

A shocking incident of gangrape has come to light in the Kukatpally area of Hyderabad, involving a man named Nawaz. The victim alleged that Nawaz befriended her under the pretext of renting a shop, eventually lured her into marriage, and then betrayed her in the most horrific way.

According to the victim, on their wedding night, Nawaz spiked her drink, after which he and four of his friends gang-raped her. She further revealed that Nawaz had cheated her financially by taking loans on her property and gold before fleeing; she later discovered she was his third wife.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *