April 4, 2026

చంద్రబాబు అభివృద్ధి దార్శనికత: అచ్చెన్నాయుడు

MINISTERS PRESS MEET

MINISTERS PRESS MEET

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలు రాష్ట్ర విధ్వంసానికి దారితీశాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిపై గత ఐదేళ్లుగా జగన్ సాగించిన కక్షసాధింపు చర్యలను ఎండగట్టారు. రాష్ట్ర ప్రజలందరూ ఆమోదించిన రాజధానిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరించిందని ఆయన విమర్శించారు.

గత అసెంబ్లీలో అమరావతికి మద్దతు తెలిపిన జగన్, అధికారంలోకి రాగానే మాట మార్చారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాజధానిని ‘శ్మశానం’, ‘ఎడారి’ అని దూషిస్తూ ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అమరావతిలో అవినీతి జరిగిందని అసత్య ప్రచారాలు చేశారే తప్ప, ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని గుర్తుచేశారు. మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రజలను మోసం చేశారే తప్ప ఏ ఒక్క ప్రాంతానికీ న్యాయం చేయలేదని విమర్శించారు.

APలో పిడుగుల బీభత్సం: జాగ్రత్త! ఈ వార్తను కూడా చదవండి

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు ప్రజలు 2014లో చంద్రబాబును గెలిపించారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అందరి ఆమోదంతో, 29 వేల మంది రైతుల స్వచ్ఛంద భూసేకరణతో అమరావతిని ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా చంద్రబాబు తీర్చిదిద్దారని కొనియాడారు. రాజధాని నిర్మాణం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా అభివృద్ధి చేసే దార్శనికత చంద్రబాబుకే ఉందని చెప్పారు. గత పాలకుల వల్ల ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో మళ్లీ పట్టాలెక్కడం శుభపరిణామమని అన్నారు.

జగన్ ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో మరో కొత్త డ్రామాకు తెరలేపారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. గతంలో మూడు రాజధానుల పేరుతో మోసం చేసిన వ్యక్తికి ‘విశ్వసనీయత’ అనే పదం వాడే నైతిక హక్కు లేదని దుయ్యబట్టారు. ప్రజలు మరోసారి తిరగబడితే జగన్ రాజకీయాల నుండే కనుమరుగవుతారని హెచ్చరించారు. అమరావతే ఆంధ్రుల భవిష్యత్తు అని, దాని ద్వారానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.

#Atchennaidu #Amaravati #ChandrababuNaidu #APPolitics #TDP #Development #AndhraPradesh #CapitalCity

APలో పిడుగుల బీభత్సం: జాగ్రత్త! ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *