డియన్ రైల్వేలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కానుంది. దేశవ్యాప్తంగా 17 రైల్వే జోన్‌లు, వివిధ ఉత్పాదక యూనిట్లలో 51 విభాగాల్లో 6,374 టెక్నీషియన్ల పోస్టులను భర్తీ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. జూన్ 10న అన్ని జోనల్ రైల్వేలకు లేఖ రాసి, భర్తీ ప్రక్రియకు ఆమోదం తెలిపింది.
రైల్వేలో కొత్త ఉద్యోగాలు: టెక్నీషియన్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్
న్యూఢిల్లీ, జూన్ 19: ఇండియన్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న 17 రైల్వే జోన్‌లు (railway zones) మరియు వివిధ ఉత్పాదక యూనిట్లలో, సిగ్నల్, టెలికమ్యూనికేషన్ విభాగంతో సహా మొత్తం 51 కేటగిరీలలో సాంకేతిక పోస్టుల (technical posts) భర్తీకి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. దాదాపు 6,374 ఖాళీలను భర్తీ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
ఈ భర్తీ ప్రక్రియకు సంబంధించి జూన్ 10న రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోనల్ రైల్వేలకు లేఖ రాసింది. ఆన్‌లైన్ మానవ వనరుల నిర్వహణ వ్యవస్థలోని టెక్నీషియన్ ఖాళీలను అంచనా వేసినట్లు అందులో తెలిపింది. ఈ పోస్టులను 2025 సంవత్సరానికి 51 కేటగిరీలలో 6,374 టెక్నీషియన్ల ఖాళీలకు కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్ (centralized employment notification) జారీ చేయడానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది.
బెంగళూరులోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఛైర్మన్‌తో సంప్రదించి, మొత్తం 51 కేటగిరీలలో ఖాళీగా ఉన్న పోస్టులను సవరించి ఆన్‌లైన్ వ్యవస్థలో అప్‌లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ అన్ని జోన్‌లను ఈ లేఖలో కోరింది. రైల్వేలు/ఉత్పాదక యూనిట్లలో ఉంచిన ఇండెంట్లను నోడల్ RRB ఏకీకృతం చేసి కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్ జారీ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా రైల్వేలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రైల్వే మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు భర్తీ ప్రక్రియను చేపడుతోంది.
ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ ఉద్యోగాలు
మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్‌లలో వివిధ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ (RRB NTPC) ఉద్యోగాలకు సంబంధించి నియామక ప్రక్రియ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఈ నెల చివరి వరకు ఆన్‌లైన్ రాత పరీక్షలు (online written exams) నిర్వహిస్తోంది. ఈ పరీక్షలకు దాదాపు 1.2 కోట్ల మంది నిరుద్యోగులు హాజరుకానున్నారు.
తాజాగా రైల్వేలో ఖాళీగా ఉన్న 6,374 టెక్నీషియన్ పోస్టుల భర్తీని త్వరలోనే ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఈ పోస్టులను సిగ్నల్, టెలికమ్యూనికేషన్ సహా 51 కేటగిరీల్లోని గ్రేడ్-సి (Grade-C) కింద భర్తీ చేయనున్నారు. సిగ్నల్, టెలికాం విభాగంలో చివరిసారిగా 2017లో నియామకాలు జరిగాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఆ విభాగం నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు (job opportunities) లభించనున్నాయి.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.