తిరుమల ప్రక్షాళన.. పవిత్రత.. కాపాడతాం అంటూ పదే పదే మాటలు చెప్పి, ఊదరగొట్టే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలులో విఫలమవుతుందని బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు.. “తిరుమల ధర్మకర్తల పాలకమండలి ఏర్పాటులో మాత్రం నిలువెల్లా స్వార్థం, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని, అవినీతి తంతు, భజన బృందం కలయిక” కనిపిస్తోందని రామచంద్ర యాదవ్ విమర్శించారు..
“తిరుమల విషయంలో భవిష్యత్తు తరాలు క్షమించరాని తప్పులు ఈ ప్రభుత్వం చేస్తుంది.. చంద్రబాబు అధికారం చేపట్టాక తిరుమల విషయంలో భక్తి, శ్రద్ధలు ఉన్నట్టు జనాల్ని మభ్యపెట్టి.. బిల్డప్ కొట్టి..
అమలులోకి వచ్చే సరికి మాత్రం గతంలో జగన్ అవలంభిస్తున్న విధానాలనే (కార్పొరేట్, రాజకీయ, అవినీతి) బాబు ప్రభుత్వం కూడా అవలంబిస్తూ.., ఈ బోర్డు తిరుమల ప్రక్షాళన కోసం కానే, కాదు కేవలం రాజకీయ, కార్పొరేట్ వ్యవహారాలను చక్కబెట్టుకోడానికే.. తిరుమల విషయంలో ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని బీసీ యువజన పార్టీ ఎత్తిచూపి, పోరాడుతుంది.. చంద్రబాబు గారికి వచ్చే ప్రతీ అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ దుర్వినియోగం చేసుకుని, స్వామివారిని రాజకీయానికి వాడుకుంటున్నారు” అంటూ రామచంద్ర యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఇదేనా సనాతన ధర్మ రక్షణ.., ఇటువంటి వారితో సాధ్యమా అంటూ ప్రశ్నించారు..!
* తెలుగుదేశం పార్టీకి గత కొన్నేళ్ళుగా భజన చేస్తున్న మీడియా అధిపతికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు.. ఆయనపై ఉన్న ఆరోపణల సంగతేమిటి..? డ్రగ్స్, భూముల అవినీతి విషయంలో అతని పాత్రపై ఎన్నో అనుమానాలున్నాయి.. సొంత సామాజికవర్గం, సొంత భజన, సొంత మనిషికి కీలక పదవిని కట్టబెట్టారు..
* తెలుగుదేశం పార్టీలో రాజకీయ నిరుద్యోగులకు కొందరికి బోర్డులో పదవులు కట్టబెట్టారు.. కార్పొరేట్ లాబీయింగ్ అనుభవం ఉన్న వేమిరెడ్డి గారికి మరోసారి అవకాశం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి..?
* ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు కార్పొరేట్ శక్తులకు, రాజకీయ నిరుద్యోగులకు బోర్డులో చోటు కల్పించారు..
వీళ్లతో ప్రక్షాళన సాధ్యమా..?
తిరుమల కోట్లాది భక్తుల మనోభావాలను ముడి పెట్టుకున్న అతిపెద్ద పుణ్యక్షేత్రం.. అక్కడ పాలనా వ్యవహారాలు, నిర్ణయాలు అన్నీ వారిపై ప్రభావితం చూపిస్తాయి.. అటువంటి కీలకమైన చోట రాజకీయ, కార్పొరేట్, అవినీతి శక్తులకు చోటు ఇవ్వడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి..? కార్పొరేట్ లాబీయింగులు, అధికార అవసరాలు, రాజకీయ ప్రయోజనాలు తప్ప దీనిలో ఆధ్యాత్మికత, భక్తిభావం ఎక్కడ ఉన్నాయి..? ఈ బోర్డు ఏర్పాటు ద్వారా తిరుమల ప్రక్షాళన, పవిత్రత ఏ విధంగా కాపాడగలరో ఈ ముఖ్యమంత్రి గారు చెప్పగలరా..? వీళ్లతో సనాతన ధర్మం ఎలా కాపాడగలతో ఉప ముఖ్యమంత్రి గారు చెప్పగలరా..!?
* రాజకీయాలకు, కార్పోరేట్ కి సంబంధం లేని తిరుమల కోసం మా పార్టీ నిరంతరాయంగా పోరాటం చేస్తూనే ఉంటుంది.. సొంత డెయిరీ ఏర్పాటుపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం శ్రద్ధ లేదని అర్థమైంది.. కనీసం ఆధ్యాత్మికత, పవిత్రతపై అయినా దృష్టి లేదని ఈ బోర్డు ద్వారా తేటతెల్లమయిందని ఆయన మండిపడ్డారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.