జనవరి 10 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ (Sankranti Holidays) సంక్రాంతి పండగ సెలవులను ఖరారు చేసినట్లు సంబంధిత అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు ప్రభుత్వ, ప్రయివేటు (Schools and Educational Institutions) పాఠశాలలు, విద్యాసంస్థలకు మొత్తం తొమ్మిది రోజుల పాటు పండగ సెలవులు ఉండనున్నట్లు వెల్లడించారు. సెలవుల అనంతరం జనవరి 19వ తేదీ నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు.
సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకునేందుకు ఈ సెలవులు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు.
#SankrantiHolidays
#AndhraPradesh
#SchoolHolidays
#APGovernment
#SankrantiFestival