April 1, 2026

విజేతగా నిలిచిన AP మహిళల డెఫ్ క్రికెట్ జట్టు

SAP CHAIRMAN RAVI NAIDU

SAP CHAIRMAN RAVI NAIDU

హర్యానా వేదికగా జరిగిన జాతీయ స్థాయి డెఫ్ టి10 క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది. మార్చి 23 నుండి 27 వరకు జరిగిన ఈ పోటీలలో మొత్తం 9 జట్లు తలపడగా, ఫైనల్‌లో ఢిల్లీ జట్టును మట్టికరిపించి ఏపీ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది.

విజయవాడలోని శాప్ (SAP) ప్రధాన కార్యాలయంలో బుధవారం విజేత జట్టు సభ్యులను శాప్ చైర్మన్ రవి నాయుడు ఘనంగా అభినందించారు. క్రీడాకారిణుల కృషి, పట్టుదల రాష్ట్రానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించి దేశానికి మరిన్ని పతకాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

IPL: P.KINGS అదిరే బోణీ ఈ వార్తను కూడా చదవండి

ఈ అభినందన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జి. రవీంద్రబాబు, అర్జున అవార్డు గ్రహీత ఐ. అజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారిణులు సాధించిన ఈ విజయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.

#APSports #WomenInCricket #DeafCricket #NationalChampions #AndhraPradesh #SuccessStory #Inspiration

IPL: P.KINGS అదిరే బోణీ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *