March 10, 2026

కొమ్మినేని అక్రమ అరెస్ట్‌ను ఖండించిన వైస్సార్సీపీ నేతలు

ఒంగోలు, జూన్ 9:  జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ రావును అక్రమంగా అరెస్ట్ చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రకాశం జిల్లా నాయకులు ఒంగోలు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఒంగోలు అసెంబ్లీ ఇన్‌ఛార్జి చుండూరి రవి బాబు గారు… “వైస్సార్సీపీ నాయకులపై ఈ విధమైన దాడులు ప్రజాస్వామ్యానికి భంగంగా నిలుస్తున్నాయి” అన్నారు.

ఈ సమావేశంలో సంతనూతలపాడు అసెంబ్లీ ఇన్‌ఛార్జి మేరుగు నాగార్జున, నగర అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, మద్దిపాడు మండల ఉపాధ్యక్షుడు వాకా కోటి రెడ్డి, కందుల డానియల్, నాగలప్పలపాడు మండల కార్యదర్శి పోలీనేని వెంకటరావు తదితర నాయకులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తల హక్కులను త్రొక్కే ప్రయత్నాలు ప్రభుత్వ అనాగరిక ధోరణికి నిదర్శనం అన్నారు వారు.

“కొమ్మినేని అరెస్టు రాజకీయ ప్రేరణతో జరిగింది” అంటూ వారు ఆరోపించారు. ప్రజా ప్రతినిధుల ఆందోళనలపై ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడటం అప్రజాస్వామికమన్నారు. నాయకులు చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా వైస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని, ఇది కక్ష సాధింపు రాజకీయం అని పేర్కొన్నారు. “నాయకుడిని అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అడ్డుకోలేరు” అని హెచ్చరించారు. అన్ని రాజ్యాంగబద్ధ మార్గాల్లో న్యాయం కోసం పోరాడతామని వారు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *