March 10, 2026

దళితులపై హింసే లక్ష్యం.. హింసే మీ మార్గమా? టీజేఆర్ సుధాకర్

  • చెప్పేదేంటి? చేసేదేంటి? మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ ఘాటు విమర్శలు

పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పెట్టిన పార్టీ.. వారి రక్షణ మాధ్యేయం అని గొప్పలు చెప్పే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆచరణలో మాత్రం దళతులపై హింసే లక్ష్యం.. హింసే మా మార్గం అన్ని రీతితో వ్యవహరిస్తోందని, వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. ఇటీవల తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై చేసిన దాడిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ముందుకు రావాల్సిన పరిస్థితిలో, దళితులు మరియు మైనారిటీలపై హింసను ప్రోత్సహిస్తోందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో పరస్పర పోటీ ఉంటుందని ఆశించిన తరుణంలో, ఇది పూర్తిగా విరుద్ధంగా ప్రభుత్వ ప్రవర్తన సాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వర్గాల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి తగినది కాదు. ఈ ప్రభుత్వ ఉద్దేశం చూస్తే, దళితులను, మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన అన్నారు.

ఈ పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఇది గమనించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని టీజేఆర్ సుధాకర్ బాబు పిలుపునిచ్చారు. మిగిలిన అంశాలు ఆయన మాటల్లోనే…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *