విజువల్ వండర్ ‘నమో..రే’ సాంగ్
NAMO RAY SONG
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘నాగబంధం’ నుంచి మోస్ట్ అవేటెడ్ ‘నమో రే’ సాంగ్ విడుదలైంది. అత్యున్నత నిర్మాణ విలువల మధ్య, భక్తి భావం ఉట్టిపడేలా సాగే ఈ పాట ప్రేక్షకులకు ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తలపిస్తోంది. శ్రీహర్ష ఈమని సాహిత్యం, జునైద్ కుమార్-అభే అందించిన సంగీతం వెరసి ఈ పాటను చార్ట్‌బస్టర్‌గా నిలబెడుతున్నాయి. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపరెడ్డి, నిషిత నాగిరెడ్డి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రెండు వేల మందితో భారీ నృత్యం
ఈ పాటలో ప్రధాన ఆకర్షణ దాదాపు రెండు వేల మంది డ్యాన్సర్లతో చిత్రీకరించిన మ్యాసీవ్ కొరియోగ్రఫీ. ప్రముఖ మాస్టర్లు గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ నేతృత్వంలో భారతీయ శాస్త్రీయ నృత్యరీతులతో ఈ పాటను అత్యంత వైభవంగా తెరకెక్కించారు. వెండితెరపై ఈ విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయమని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. సింధుజా శ్రీనివాసన్, ఐశ్వర్య దారూరి తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు.
అబ్బురపరిచే అనంత పద్మనాభ స్వామి సెట్
ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ ఈ సినిమా కోసం అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని తలపించేలా వేసిన భారీ సెట్ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ గ్రాండీయర్ కనిపిస్తుండటంతో సినిమా స్థాయిపై అంచనాలు పెరిగిపోయాయి. అశోక్ కుమార్ కళా నైపుణ్యం ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తోంది.
మురిపించిన నభా, దక్ష నాగార్కర్
హీరోయిన్లు నభా నటేష్, దక్ష నాగార్కర్ తమ క్లాసికల్ డ్యాన్స్‌తో ఈ సాంగ్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చారు. సాంప్రదాయ దుస్తుల్లో వారి నృత్య ప్రదర్శన పాటకు ఆధ్యాత్మిక సొబగులను అద్దింది. విరాట్ కర్ణ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటుండగా, ఈ వేసవిలో సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Nagabandham #NamoReSong #ViratKarna #NabhaNatesh #DakshaNagarkar #AbhishekNama #VisualTreat #TollywoodNews

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
