ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: జిల్లా రెవెన్యూ అధికారి (DRO) మధుసూదన్ రావు
మదనపల్లి కలెక్టరేట్‌లో 266 అర్జీల స్వీకరణ.. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు ప్రత్యేక వసతులు.
కీలక పర్యవేక్షణలో ఫిర్యాదుల పరిష్కారం
అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్‌లోని PGRS హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) మధుసూదన్ రావు, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అధికారులకు డీఆర్ఓ దిశానిర్దేశం
కార్యక్రమంలో డీఆర్ఓ మధుసూదన్ రావు అధికారులను ఉద్దేశించి పలు కీలక సూచనలు చేశారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నేరుగా పర్యవేక్షణ చేస్తోందని, అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. ప్రతి సమస్యపై ప్రజల నుండి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని, పెండింగ్‌లో ఉన్న (Beyond SLA) దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఎంతో ఆశతో వచ్చే బాధితుల సమస్యలను సావధానంగా విని, నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో సర్వే ఏడీ భరత్ కుమార్, వివిధ శాఖల జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
#Madanapalle #AnnamayyaDistrict #PGRS #DRO #MadhusudhanRao #PublicGrievance #APGovt #PeopleService #ChallaKalyani #RayalaseemaNews
