March 10, 2026

తాజా వార్తలు: మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కన్నుమూత

విశాఖపట్నం, జూన్ 7: మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93) కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు (TDP President), గాజువాక ఎమ్మెల్యే అయినటువంటి  పల్లా శ్రీనివాస్ రావు (Palla Srinivas Rao) పితృ వియోగం అయినట్లయ్యింది. తండ్రి మరణంతో పల్లా కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయింది.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పల్లా సింహాచలం, విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో (hospital) చికిత్స పొందుతున్నారు.

ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పల్లా సింహాచలం రాజకీయ జీవితంలో ప్రజలకు చేసిన సేవలు అపారమైనవి.

ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, విశాఖపట్నం ప్రాంతానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *