మాయాజాలంలా ‘కథనార్’ ట్రైలర్
KATHANAR
గోకులం మూవీస్ బ్యానర్‌పై రోజిన్ థామస్ దర్శకత్వంలో రూపొందుతున్న విజువల్ వండర్ ‘కథనార్’ ట్రైలర్ విడుదలైంది. జయసూర్య, అనుష్క శెట్టి, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అద్భుతమైన ఫాంటసీ కథాంశంతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇంద్రజాలం, రహస్య మార్గాల అన్వేషణ నేపథ్యంలో సాగే డైలాగ్స్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.
అనుష్క, ప్రభుదేవా పాత్రల సందడి
చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా, ప్రభుదేవా లుక్ కూడా ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జయసూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు ప్రధాన బలమని విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఒక్కో పాత్రను రివీల్ చేసిన తీరు, నటీనటుల గెటప్స్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉన్నాయి.
బేబికి మించి పది రెట్లు..ఈ వార్తను కూడా చదవండి
హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్
ఈ చిత్రంలో వాడిన వీఎఫ్‌ఎక్స్ (VFX) వర్క్, యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ సినిమాలను తలపిస్తున్నాయి. భారతీయ సినీ చరిత్రలో ఇది ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్‌ను అందిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నీల్ డి కున్హా సినిమాటోగ్రఫీ, రాహుల్ సుబ్రహ్మణ్యన్ అందించిన సంగీతం ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
గోకులం గోపాలన్ భారీ నిర్మాణం
ప్రముఖ నిర్మాత గోకులం గోపాలన్ ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మాయా ప్రపంచం, ఆపత్కాలంలో వచ్చే మహా మనిషి అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగే ఈ కథ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. త్వరలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది.
Kathanar #AnushkaShetty #Jayasurya #PrabhuDeva #KathanarTrailer #VisualWonder #IndianCinema #FantasyWorld
బేబికి మించి పది రెట్లు..ఈ వార్తను కూడా చదవండి

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
