March 13, 2026

ఏపీ హై కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతల స్వీకరణ

AP HIGH COURT JUSTICE LISA GILL

AP HIGH COURT JUSTICE LISA GILL

ఏపీ హై కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ హై కోర్టు మొదటి కోర్టు హాల్ లో న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చేత హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ లీసా గిల్ పంజాబ్, హర్యానా హై కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ ఏపీ హై కోర్టుకు బదిలీపై వచ్చారు. ఏపీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రియల్ నెలలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అనంతరం ఏపీ హై కోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ వ్యవహరించనున్నారు.జస్టిస్ లీసా గిల్ స్వస్థలం చండిగఢ్ కాగా పంజాబ్ యూనివర్సిటీ నుండి ఎల్ఎల్బీ, ఎల్ ఎల్ ఎం పూర్తి చేశారు.1990లో న్యాయవాదిగా పంజాబ్ హర్యానా హై కోర్టు లో ప్రాక్ట్రీస్ ప్రారంభించారు.2014 మార్చి 31న పంజాబ్ హర్యానా హై కోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యారు.

ఈకార్యక్రమంలో హై కోర్టు న్యాయమూర్తులు,అడిషినల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్,అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడ్వకేట్స్ అసోసియేషన్ వైస్ ప్రసిడెంట్ కేవీ రఘు కుమార్, బార్ కౌన్సిల్ ఛైర్మన్ ద్వారకానాథ్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నారాయణ, సీనియర్ న్యాయవాదులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు..

APHighCourt #JusticeLisaGill #WomanChiefJustice #AndhraPradesh #LegalNews #HighCourtJudge #JudiciaryIndia #TirupatiNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *