March 10, 2026

ఉద్యాన పంటలే భవిష్యత్తు దిశ

అమరావతి, జూన్ 4 : రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యాన సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ వ్యవసాయ సహకారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ సూచనలు చేశారు. బుధవారం జరిగిన ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తదుపరి 10 సంవత్సరాల లోపు horticulture ఆధారిత వ్యవసాయం రాష్ట్ర జీడీపీకి ప్రధాన భవిష్యత్ దిశగా మారనుందని తెలిపారు.

ప్రాథమిక రంగం రాష్ట్ర జీడీపీలో 35 శాతం వాటా కలిగి ఉందని, అందుకే కృషి, Horticulture, Natural Farming, Sustainable Agriculture, Market Linkage, Farmer Training వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి అవసరమన్నారు. రైతులను సంప్రదాయ పంటల సాగు నుండి ఉద్యాన పంటల వైపు మళ్లించేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

నిల్వ సౌకర్యాలు లేని పంటలకు కొత్త పరిష్కారాలను సూచించాల్సిన అవసరం ఉందని, ప్రకృతి వ్యవసాయం వాతావరణ మార్పులనూ తట్టుకుంటుందని రాజశేఖర్ వివరించారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలపై అధికంగా పండించకుండా స‌మతుల్య వ్యూహాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ సందర్భంగా 2024 బ్యాచ్ ట్రైనీ కలెక్టర్లు వివిధ ఏడు జిల్లాల్లో అసిస్టెంట్ కలెక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ సంచాలకులు ఢిల్లీరావు ట్రైనీలకు Agricultural Inputs, Fertilizer Management, Seed Quality, State and National Schemes, Farmer Welfare Programs లపై వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *