నాదనీరాజనం వేదికపై అలరించిన సంగీత సంగమం కార్యక్రమం
శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం నిర్వహించిన పద్మశ్రీ శివమణి బృందం సంగీత సంగమం కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది.
ఈ కార్యక్రమంలో ఆర్.రఘురామ్ గాత్రం అందివ్వగా మాండొలిన్ యు.రాజేష్, మృదంగం విద్యాసాగర్, కీబోర్డ్ విశాఖ్ రామ్ ప్రసాద్ లు అందించారు.
అన్నమయ్య, త్యాగరాజ, పురందరదాసులు సంకీర్తనలకు పద్మశ్రీ శివమణి తన డ్రమ్స్ ప్రదర్శనతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ పద్మశ్రీ శివమణి గారు నాదనీరాజనం వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని తెలిపారు. నాదనీరాజనం వేదికపై ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను వేలాదిమంది భక్తులు ప్రత్యేకంగా, లక్షలాదిమంది భక్తులు పరోక్షంగా వీక్షస్తున్నారని తెలిపారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చేరవేసేందుకు ఎస్వీబీసీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని తెలియజేశారు.
అనంతరం పద్మశ్రీ శివమణి బృందాన్ని ఎస్వీబీసీ సీఈఓ ఫణి కుమార్ శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవోలు లోకనాథం, సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
#Tirumala #Sivamani #NadaNeerajanam #DrumsSivamani #TTD #SVBC #DevotionalMusic #AnnamayyaSankirthana #TirupatiNews #VenkaiahChowdhary

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
