March 10, 2026

పెందుర్తిలో విషాదం: కాంక్రీట్ కుప్పలో మృతదేహం 

 పెందుర్తి, జూన్ 7: పెందుర్తి మండలం ముదపాక గ్రామంలోని జగనన్న కాలనీ నిర్మాణ స్థలంలో కాంక్రీట్ (gravel) కుప్పలో ఓ మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. సుమారు 50 సంవత్సరాల వయస్సున్న శరీరం కనిపించింది. ఆయనను విజయనగరం జిల్లా, తెర్లాం మండలం, నల్లబంద గ్రామానికి చెందిన సూరిగా గుర్తించారు.

సూరి గత మూడు రోజులుగా కనిపించడంలేదని సమాచారం. కంక్రీట్  కుప్ప నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానంతో జేసీబీ (JCB) ద్వారా పై భాగాన్ని తొలగించగా, మృతదేహం రెండు చేతులు కనిపించాయి. లారీతో    కాంక్రీట్ అన్‌లోడ్ చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి దానిపై పడుకుని ఉండగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు (investigation) చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *