వైఎస్‌ఆర్‌సీపీ తిరుపతి రూరల్ సోషల్ మీడియా అధ్యక్షునికి అనారోగ్యం
– ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పిన చెవిరెడ్డి
– ఆ కుటుంబానికి అండగా నిలబడతానన్న మోహిత్‌రెడ్డి
చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షులుగా వున్న సి.చరణ్ తేజ గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు సోమవారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తేజను పలుకరించిన చెవిరెడ్డి ధైర్యంగా వుంటే త్వరగా కోలుకోవచ్చని సూచించారు. అలాగే ఆసుపత్రిలో వైద్య సేవలకు తమ వంతు సాయం అందించడంతో పాటు ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి భరోసా కల్పించారు. వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తగానే కాకుండా తమ కుటుంబ సభ్యునిగా చరణ్ తేజను భావించి అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆ కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.
#YSRCP #ChevireddyBhaskarReddy #ChevireddyMohithReddy #Tirupati #Chandragiri #HealthUpdate #SocialMedia #Jagananna
#YSRCP #ChevireddyBhaskarReddy #ChevireddyMohithReddy #Tirupati #Chandragiri #HealthUpdate #SocialMedia #Jagananna

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
