చంద్రగిరి నీటి కష్టాలకు చెక్!
JANASENA DEVARA MANOHAR
చంద్రగిరి నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా నెలకొన్న సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ పట్టుదలతో తలకోన బ్యాక్ వాటర్ అనుసంధాన ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, నిరంతర ఫాలోఅప్తో అధికారుల ద్వారా సమగ్ర నివేదిక సిద్ధం చేయించడంలో మనోహర్ విజయం సాధించారు. తాజాగా రూ. 41.49 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు నీటి వనరుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
తలకోన వరద నీటితో జలకళ
ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగంగా తలకోన నది వరద నీటిని ఒడిసిపట్టి స్థానిక చెరువులను నింపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పులిబోనుపల్లి సమీపంలోని గజలేరు వంకపై రూ. 23.16 కోట్లతో పిక్ అప్ ఆనికట్ నిర్మించనున్నారు. దేవర మనోహర్ సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, నీటి మళ్లింపునకు ఉన్న అవకాశాలను పరిశీలించి కలెక్టర్కు నివేదిక సమర్పించారు. ఈ ఆనికట్ నిర్మాణం పూర్తయితే నియోజకవర్గంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా భూగర్భ జలమట్టం కూడా పెరుగుతుంది.
AP ASSEMBLY: శాశ్వత రాజధానిగా “అమరావతి”.. చారిత్రాత్మక తీర్మానం ఈ వార్తను కూడా చదవండి
కాలువల ఆధునీకరణకు భారీ నిధులు
ప్రాజెక్టులో భాగంగా కాలువల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. అయ్యప్పరెడ్డి చెరువు నుంచి గొట్టిగంటి చెరువు వరకు సరఫరా కాలువ పనులకు రూ. 8 కోట్లు, అర్లపెంట వంక నుంచి చవటగుంట వరకు కాలువ మెరుగుదలకు రూ. 7.68 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే వలసపల్లి చెరువు నుంచి రామరాజు చెరువు వరకు రూ. 2.65 కోట్లతో కొత్త కాలువ తవ్వకానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ పనులన్నీ పూర్తయితే చంద్రగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల చెరువులు ఏడాది పొడవునా నీటితో కళకళలాడనున్నాయి.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను వేగవంతం చేసినందుకు దేవర మనోహర్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేవలం సమస్యలను ఎత్తిచూపడమే కాకుండా, వాటికి శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించి నిధులు మంజూరయ్యేలా కృషి చేయడమే తన బాధ్యతని ఆయన పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజల నీటి కష్టాలను పూర్తిగా దూరం చేసే వరకు తన పోరాటం కొనసాగుతుందని మనోహర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులు రాగానే యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది.
#Chandragiri #WaterSecurity #Janasena #DevaraManohar #Talakona #Irrigation #APDevelopment #Tirupati #WaterManagement #CleanAndGreen
AP ASSEMBLY: శాశ్వత రాజధానిగా “అమరావతి”.. చారిత్రాత్మక తీర్మానం ఈ వార్తను కూడా చదవండి

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
