March 10, 2026

కవితపై కేసీఆర్ నిశ్శబ్దం: బీఆర్ఎస్‌లో అంతర్గత కలహాలు

హైదరాబాద్‌: బీఆర్ఎస్‌ (BRS) పార్టీ లోపల పతాక రాజకీయం నడుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ తన కుమార్తె ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. Leak letter వ్యవహారం జరిగి పది రోజులైనా కేసీఆర్ కవితను పిలిచి మాట్లాడలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, కవిత చేసిన ఆనాడు ఎపిసోడ్ వ్యాఖ్యలపై స్పందించకుండా మౌనం వీడకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పార్టీ అధినేత KCR పిలుపు కోసం ఎదురుచూస్తున్న కవిత కార్యకలాపాలను జాగృతి సంస్థ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. అయితే ఆమె నిర్వహించే ఈ కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు దూరంగా ఉంటున్నారు. “కేసీఆర్ నాయకుడే” అని కవిత చెబుతున్నా, క్యాడర్ స్పందించకపోవడం విశేషంగా మారింది. ఆమె చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్ పై విరుచుకుపడటం వంటి పరిణామాలు పార్టీలో అభ్యంతరాలు కలిగిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది.

BRS Working President కేటీఆర్ (KTR) ప్రస్తుతం యూకే (UK) పర్యటనలో ఉన్నారు. మే 26న లండన్ వెళ్లిన ఆయన, ఆ తర్వాత అమెరికా డల్లాస్ (Dallas) లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవంలో పాల్గొన్నారు. ఆయన ఇంకా నాలుగు రోజులు అమెరికాలోనే ఉండనున్నారు. జూన్ 10న హైదరాబాద్ చేరుకునే అవకాశమున్నా, కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్లే రోజు కావడంతో ఇద్దరు నేతల మధ్య సమావేశం సాధ్యాసాధ్యాలపై చర్చ సాగుతోంది.

కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తారా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ అయింది. అన్నపై విమర్శలు చేసిన కవితపై కేటీఆర్ మౌనం ఎంతవరకు కొనసాగుతుందోనని కార్యకర్తలు, నాయకులు ఉత్కంఠతో ఉన్నారు. కేసీఆర్‌–కవిత మధ్య శీతల సంబంధాలు, కేటీఆర్ రాజకీయ ప్రాధాన్యత పెరుగుతున్న దశలో పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభం (internal crisis) నెలకొన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *