Arava Sridhar Clean Chit : జనసేన ఇచ్చేసిందా?
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. బాధితురాలు హర్ష వీణ రోజుకో వీడియో విడుదల చేస్తూ తన దగ్గర ఉన్న సాక్ష్యాలను బయటపెడుతున్నా, పార్టీ అధిష్టానం మాత్రం ప్రస్తుతం మౌనంగా ఉండటం చర్చనీయాంశమైంది. జనవరి 28న ఈ వ్యవహారంపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించిన జనసేన, నివేదిక వచ్చే వరకు శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. కానీ తాజాగా జరిగిన జనసేన ఎల్పీ సమావేశంలో ఆయన ప్రత్యక్షమవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ క్లీన్చిట్ కహానీ వెనుక అసలు కథ ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కమిటీ ముందు హాజరై శ్రీధర్ వివరణ ఇచ్చినా, బాధితురాలు మాత్రం తనను నేరుగా విచారించలేదని ఆరోపిస్తున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి ఆయనకు లోపాయికారీగా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, అందుకే ఆయన నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. కమిటీ నివేదిక బహిర్గతం కాకముందే ఆయన యాక్టివ్ అవ్వడం వెనుక పార్టీ వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు.
మరోవైపు బాధితురాలు హర్ష వీణ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు విన్నవించుకుంటున్నారు. ఒకవేళ పార్టీ క్లీన్చిట్ ఇచ్చి ఉంటే అది తనకు అధికారికంగా తెలియజేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కమిటీ ఏర్పాటై రెండు నెలలు గడుస్తున్నా విచారణ కొనసాగుతోందని చెబుతున్నారే తప్ప, తుది నిర్ణయాన్ని మాత్రం ప్రకటించడం లేదు. దీంతో ఇది కేవలం వ్యక్తిగత అంశమని పార్టీ భావిస్తోందా లేదా ఆయనను సేవ్ చేసే ప్రయత్నం చేస్తోందా అన్న సందేహాలు బలపడుతున్నాయి.
Read this article also : ఆళ్లగడ్డలో కేబుల్ వార్: అఖిల వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి
మైసూరువారి పల్లెలోని పార్టీ కార్యాలయంలో జరిగిన అంతర్గత సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం కూడా ఈ అనుమానాలను మరింత పెంచింది. శ్రీధర్ వరుసగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండటం, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశానికి హాజరుకావడం చూస్తుంటే ఆయనకు అనధికారికంగా క్లీన్చిట్ లభించినట్టే కనిపిస్తోంది. హైకమాండ్ నుంచి ‘నీ పని నువ్వు చేసుకో’ అని గ్రీన్ సిగ్నల్ రాబట్టే ఆయన ఇంత ధైర్యంగా ముందుకు సాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతానికి జనసేన వర్గాల్లో అరవ శ్రీధర్ అంశం ఒక మిస్టరీలా మారింది. సాక్ష్యాలు ఉన్నాయని బాధితురాలు మొత్తుకుంటున్నా, పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కేడర్‌లో కూడా అయోమయం నెలకొంది. కమిటీ నివేదికను పక్కన పెట్టేశారా లేక నివేదికలో ఆయనకు అనుకూలంగా ఫలితం వచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.
English Summary
The sexual harassment allegations against Railway Koduru Jana Sena MLA Arava Sridhar have stirred significant controversy in Andhra Pradesh politics. Despite the formation of a three-member committee by the party high command to investigate the claims made by Harsha Veena, no official report has been released yet.
Recent developments suggest that Sridhar might have received an informal green light from the leadership, as he was seen attending the JLP meeting chaired by Pawan Kalyan. While the victim continues to demand justice and transparency regarding the committee’s findings, the MLA’s active participation in party programs indicates a possible clean chit.

