March 10, 2026

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ఎక్స్‌గ్రేషియా పెంచిన టాటా గ్రూప్! రూ.కోటితో పాటు అదనంగా..

అహ్మదాబాద్‌లో  జరిగిన ఎయిర్ ఇండియా  విమాన ప్రమాదంలో  మరణించిన వారి కుటుంబాలకు టాటా గ్రూప్   తమ ఎక్స్‌గ్రేషియాను   పెంచింది. మొదట ప్రకటించిన $1 కోటితో పాటు, అదనంగా $25 లక్షలు అత్యవసర సాయంగా   అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం పరిహారం $1.25 కోట్లకు చేరుకుంది.

ముంబై, జూన్ 14: అహ్మదాబాద్‌లో (Ahmedabad) జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Air India plane crash) మృతి చెందిన వారి కుటుంబాలకు టాటా గ్రూప్ (Tata Group) మొదట $1 కోటి ఎక్స్‌గ్రేషియాను (Ex-gratia) ప్రకటించింది. తాజాగా, అదనంగా $25 లక్షలు అత్యవసర సాయంగా (Emergency aid) అందించనున్నట్లు ప్రకటించారు. మొత్తం $1.25 లక్షల పరిహారం లబ్ధిదారులకు అందనుంది.

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 269 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా మాతృ సంస్థ టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి $1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ (N. Chandrasekaran) ప్రకటించారు. అయితే.. ఇప్పుడు తాజాగా మరోసారి ఎయిర్ ఇండియా నుంచి ఓ ప్రకటన వచ్చింది. ముందుగా ప్రకటించిన $1 కోటి ఎక్స్‌గ్రేషియాకు అదనంగా మరో $25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది అత్యవసర సాయంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. మొత్తంగా టాటా గ్రూప్ నుంచి మృతుల కుటుంబాలకు $1.25 లక్షల పరిహారం అందనుంది. ఈ నిర్ణయం బాధితుల కుటుంబాలకు కొంత ఊరటనిస్తుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *