March 10, 2026

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: 242 మంది ప్రయాణికులు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఘోర విమాన ప్రమాదం (Plane Crash) సంభవించింది. టేకాఫ్ అవుతుండగా ఎయిర్ ఇండియా (Air India) విమానం మేఘాని ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారీగా పొగ వ్యాపించగా, సహాయక బృందాలు (Rescue Teams) మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

అహ్మదాబాద్, జూన్ 12: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) చోటుచేసుకుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్‌ ఇండియా (Air India) విమానం కూలింది. విమానంలో చాలామంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొంటున్నారు. ప్రమాదం తరువాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్‌ కాగానే విమానం కుప్పకూలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు (Rescue Teams).. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. జనావాసాలపై విమానం కూలినట్లు చెబుతున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు.

అహ్మదాబాద్‌లో టేకాఫ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం వెనుక భాగం చెట్టును ఢీకొట్టిందని సమాచారం. విమానం అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతుండగా. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు. కాగా, ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *