రేవంత్‌ను భీమవరం బుల్లోడు అనాలా?: సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన చేరికల కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి భాష, రాజకీయ శైలి, పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (KTR Slams CM Revanth Reddy)
కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలతోనే పరిమితమైందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క చెరువు కూడా నిర్మించలేదని, బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన చెక్‌డ్యాంలను బాంబులతో పేలుస్తున్నారని విమర్శించారు. ఇసుక దందాల కోసమే ఈ చర్యలు జరుగుతున్నాయని అన్నారు. (Congress Government Failures)
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్‌రెడ్డి అమలు చేయడం లేదని, కోటి మంది మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీపై ముందుగా శపథం చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక విమర్శలకు దిగుతున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వారికి తట్టుకోలేని పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. (BRS vs Congress Telangana)
2026–27 నాటికి రాజకీయ వాతావరణం మారుతుందని, కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ శ్రేణులు పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ ప్రజలు బీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తున్నారని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
#KTR
#RevanthReddy
#BRSPolitics
#TelanganaPolitics
#CongressVsBRS