బాండీ బీచ్ కాల్పుల కేసులో షాకింగ్ ట్విస్ట్!
సిడ్నీలోని బాండా బీచ్ (Bondi Beach)లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడిన తండ్రీకొడుకుల్లో తండ్రి సాజిద్ అక్రమ్ (50) పోలీసుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ శవాన్ని తీసుకోవడంపై అతని భార్య వెల్లడించిన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. తన భర్త మృతదేహాన్ని తీసుకునేందుకు ఆమె నిరాకరించడమే కాకుండా, అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో హనుక్కా వేడుకలపై కాల్పులు జరిపి 15 మందిని పొట్టనబెట్టుకున్న సాజిద్ అక్రమ్ ఉదంతంలో మరో విషాదకర మలుపు వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదిగా ముద్రపడిన సాజిద్ మృతదేహం ప్రస్తుతం సిడ్నీలోని మార్చురీలో ఉంది. అయితే, అతడి మృతదేహాాన్ని క్లెయిమ్ చేయడానికి (Claim) తన భార్య నిరాకరించింది.
భార్య ఏమన్నది? సాజిద్ అక్రమ్ భార్య (యురోపియన్ మూలాలున్న మహిళ) అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పింది. “అతని మృతదేహాన్ని తీసుకోను.. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని ఆమె స్పష్టం చేసింది. సాజిద్ ఆఖరి నిమిషం వరకు తన కుటుంబంతో కూడా నమ్మకద్రోహానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాల్పుల కోసం బయలుదేరే ముందు, తన కుటుంబ సభ్యులతో “మేము జెర్విస్ బే (Jervis Bay)కి ఫిషింగ్ ట్రిప్ వెళ్తున్నాం” అని అబద్ధం చెప్పి కొడుకు నవీద్‌తో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
కొత్తగా బయటపడ్డ మరిన్ని వివరాలు:
హైదరాబాద్ లింకులు: సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. ఇక్కడ బీకాం పూర్తి చేసి 1998లో ఆస్ట్రేలియా వలస వెళ్లాడు. ఇప్పటికీ ఇతని వద్ద భారత పాస్‌పోర్ట్ ఉంది.
మతోన్మాదం: సాజిద్, అతని కొడుకు నవీద్ కలిసి ఐసిస్ (ISIS) భావజాలంతో ప్రభావితమైనట్లు పోలీసులు గుర్తించారు. వీరు కాల్పులకు ముందు తమ చర్యను సమర్థిస్తూ వీడియోలు కూడా తీసుకున్నారు.
ట్రైనింగ్: ఈ దాడికి కొన్ని వారాల ముందే సాజిద్ ఫిలిప్పీన్స్‌లోని దావో (Davao) ప్రాంతానికి వెళ్లి ఆయుధాల శిక్షణ పొందినట్లు అనుమానాలు ఉన్నాయి.
కుటుంబ దూరం: గత ఆరు నెలలుగా సాజిద్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని, సిడ్నీలో హోమ్‌లెస్ (నిరాశ్రయుడు)గా ఉంటూ వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నాడని సమాచారం.