April 8, 2026

కేరళలో Revanth Reddy ఎన్నికల ప్రచారం: పినరయి విజయన్‌పై నిప్పులు

Revanth Reddy

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కేరళ, తెలంగాణ మధ్య కాదని, అక్కడి యూడీఎఫ్ మరియు ఎల్డీఎఫ్ కూటముల మధ్య జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పినరయి విజయన్ 120 నెలల పాలన కేవలం వైఫల్యాలకు ప్రతీకగా నిలిచిందని, ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ విమర్శించారు. కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రులదేనని ఆయన గుర్తు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం పినరయి విజయన్ మధ్య అవగాహన ఉందని, అందుకే విజయన్‌పై ఎలాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరగడం లేదని రేవంత్ ఆరోపించారు. గాంధీ కుటుంబం సహా అనేకమంది విపక్ష నేతలను వేధిస్తున్న కేంద్రం, విజయన్ జోలికి ఎందుకు వెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు.

కొనసాగుతున్న లేఖల యుద్ధం ముఖ్యమంత్రి Revanth Reddy మరియు కేరళ సీఎం విజయన్ మధ్య సోషల్ మీడియా వేదికగా మరియు లేఖల రూపంలో మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. నీతి ఆయోగ్ నివేదికలను ఉదహరిస్తూ విజయన్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ ధీటుగా బదులిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీల పదేళ్ల దుష్పరిపాలన వల్ల వచ్చిన పాత గణాంకాలను చూపవద్దని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్థిక సూచీల్లో కేరళను కూడా అధిగమించిందని ఆయన పేర్కొన్నారు.

బంగారం స్మగ్లింగ్ కేసు ఎందుకు అపరిష్కృతంగా ఉందో సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. శబరిమల ఆలయం నుంచి బంగారం అక్రమ తరలింపు ఆరోపణలపై విజయన్ ప్రభుత్వం మౌనం వహించడం వెనుక మర్మమేమిటని ప్రశ్నించారు. కేరళ ప్రజలు పోలింగ్ బూత్‌లో సరైన నిర్ణయం చెబుతారని, అక్కడ నవ కేరళ ఆవిర్భవిస్తుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *