
భారతదేశాన్ని ముప్పుగా చూపుతూ, పాకిస్థాన్ అణ్వాయుధ సంపత్తిని వేగంగా పెంచుకుంటోంది. మారింది. సుదీర్ఘ కాలంగా చైనా మిలిటరీ మద్దతుతో ముందుకుసాగుతున్న పాకిస్థాన్, దక్షిణాసియా శాంతికి గణనీయమైన ముప్పుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం చెప్పింది ఎవరోకాదు. ప్రపంపచ పెద్దన్న అని చెప్పుకునే అమెరికా దేశ రక్షణ గూఢచార సంస్థ. ఆ సంస్థ తన నివేదికలో పాకిస్తాన్ అణ్వాయుధాల అంశాన్ని ప్రస్తావించింది. తాజా హెచ్చరికతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్థాన్ జాతీయ భద్రతా వ్యూహంలో భారత్‌పై ఎదురుదాడికి అణు ఆయుధాలు కీలకంగా మారతాయనే ఇప్పుడు చర్చనీయాంశంగా
అమెరికా రక్షణ గూఢచార సంస్థ (డీఐఏ) తాజాగా విడుదల చేసిన వార్షిక ముప్పు అంచనా నివేదికలో, పాకిస్థాన్ తన సైనిక వ్యూహంలో భారత్‌ను ముప్పుగా చూస్తోందని, అదే సమయంలో తన అణు సామర్థ్యాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది. విదేశాల నుంచి అణుశక్తి సంబంధిత పదార్థాలను సంపాదించడంలో పాకిస్థాన్ చేసే ప్రయత్నాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే చైనాతో సన్నిహిత సైనిక సంబంధాలు కొనసాగిస్తున్నదని వివరించింది.
2024లో నవంబర్‌లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ)తో కలసి పాకిస్థాన్ నిర్వహించిన సరికొత్త వైమానిక అభ్యాసాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. వచ్చే ఏడాది పాకిస్థాన్ సైన్యం ప్రధానంగా సరిహద్దుల గొడవలు, తహ్రీక్-ఎ-తాలిబాన్ మరియు బలోచ్ జాతీయవాద గ్రూపుల దాడులను ఎదుర్కోవడం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు, అణు ఆయుధాల ఆధునికీకరణకే ప్రాధాన్యత ఇవ్వనుందని డీఐఏ అంచనా వేసింది.
భారతదేశపు సంప్రదాయ సైనిక బలాన్ని సమతుల్యం చేయడానికి పాకిస్థాన్ ప్రత్యేకంగా బాటిలీ అణు ఆయుధాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని ఈ నివేదిక పేర్కొంది.
డీఐఏ నివేదిక ప్రకారం, పాకిస్థాన్ యొక్క అణుశక్తి సంబంధిత సామగ్రి ప్రధానంగా చైనాలోని సరఫరాదారుల నుంచే వస్తోందని, కొన్ని సార్లు హాంకాంగ్, సింగపూర్, టర్కీ, యుఏఈ ద్వారా సరఫరా అవుతోందని వెల్లడించింది.
ఆర్మ్స్ కంట్రోల్ అండ్ నాన్-ప్రోలిఫరేషన్ సెంటర్ నివేదిక ప్రకారం, 2024 నాటికి పాకిస్థాన్ సుమారు 170 అణు వార్‌హెడ్లను కలిగి ఉందని, వాటిని క్రమంగా విస్తరిస్తూ ఆధునీకరిస్తోందని పేర్కొంది. ఇది డీఐఏ 1999లో చేసిన అంచనాల కన్నా ఎక్కువ. అప్పట్లో 2020 నాటికి 60-80 వార్‌హెడ్లు ఉంటాయని భావించగా, 2025 నాటికి ఈ సంఖ్య 200కి చేరే అవకాశముందని తాజా నివేదిక చెబుతోంది.
పాకిస్థాన్ అణు ఆయుధాల సంఖ్యపై అధికారిక సమాచారం లేదు. ప్రభుత్వంగా ఎప్పుడూ వీటి వివరాలను బహిర్గతం చేయలేదు. అందువల్ల నిపుణులకు సరైన అంచనాలు వేయడం కష్టమవుతోంది.
ఇండియాను మించిన సంప్రదాయ సైనిక శక్తిని సమతుల్యం చేయాలన్న ఉద్దేశంతో, పాకిస్థాన్ తక్కువ శక్తి గల ‘టాక్టికల్’ అణుఅస్త్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. భారత్ లాగా కాకుండా, పాకిస్థాన్ ‘నో ఫస్ట్ యూజ్’ విధానాన్ని స్వీకరించలేదు. ఈ దేశం తీసుకునే నిర్ణయం ప్రపంచాన్ని ఏ దిశగా తీసుకెళ్ళుతాయో తెలియడం లేదు. పైగా డ్రాగన్ దేశం మద్దతు సంపూర్ణంగా ఉండడంతో ఇది మూడోప్రపంచ యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యపోనవసరం లేదు.