ఈ మధ్య కాలంలో భారీ చిత్రాలు ప్రేక్షకులను కొన్ని భయపెడుతుంటే, మరికొన్ని అలరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ‘లగ్గం’ Laggam సినిమా జనం ముందుకు వచ్చింది. కుటుంబ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ‘లగ్గం’ సినిమా ప్రేక్షక లోకాన్ని అలరించిందా? లేదా? ఆదరణ పొందిందా? లేదా? తెలుసుకోవాలంటే రండీ మనసుతో చూసేద్దాం..
కథేంటో : అనగనగా… తెలంగాణలో ఓ పల్లెటూరు. సదానందం( రాజేంద్రప్రసాద్) అనే ఓ సగటు తండ్రికి మానస (ప్రగ్యా నాగ్రా) అనే ఓ కూతురు ఉంది. మానస చిన్నప్పుడే తన భార్య చనిపోవడంతో సదానందం కూతుర్ని మురిపెంగా పెంచుకుంటాడు. మానస అంటే తన మేనత్త(రోహిణి)కు ఎంతో ఇష్టం. మానసను ఒక కూతురులా చూస్తుంది. సదానందం మేనల్లుడు చైతన్య (సాయి రోనక్). చైతన్య అన్ని సౌకర్యాలు కలిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మేనల్లుడు, మొదటి నుంచి తెలిసిన వాడు. పై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అందుకే మేనల్లుడికి తన కూతురుని ఇచ్చి ‘లగ్గం’ చేయాలనకుంటాడు సదానందం. తన ప్రతిపాదనను ఆ కుటుంబం ముందు పెడతాడు. ఇరుకుటుంబాలు అంగీకరిస్తాయి. అనుకున్నదే తడువుగా పెళ్లి పనులు మొదలౌతాయి.
మలుపు : అందరూ ఆనందంగా ఉన్న సమయంలో అనుకోని పరిస్థితుల్లో చైతన్య ఉద్యోగం పోతుంది. ఈ సంగతి తెలుసుకున్న సదానందం ఏం చేశాడు? ఈ పరిస్థితుల్లో లగ్గం జరిగిందా? లేదా? ఇక సగటు మనిషి చేసే విన్యాసాలు ఏంటి? అనేది సినిమా.
Analyzation విశ్లేషణ: తెలంగాణలో జరిగే పెళ్లి అంటేనే జోరుగా హుషారుగా సాగుతుంది. ఇక వేడుకకి ఓ ఫ్యామిలీ డ్రామా మొదలవుతుంది. దీనిలోంచే ఓ సందేశాన్ని ఇవ్వడమే కథ. తెలంగాణ పల్లె జీవనం, సాఫ్ట్‌వేర్ జాబ్‌పై ఆడపిల్లల తల్లితండ్రులకు వున్న క్రేజ్, తెలంగాణ పెళ్లిలో జరిగే క్రతువులు, ప్రేమ, జాలి మధ్య వ్యత్యాసం, మేనకోడలు, మేనత్త మధ్య అనుబంధం ఇలా పలు కోణాల్లో ఈ సినిమా సాగుతుంది.
సాఫ్ట్‌వేర్ జాబ్‌లోని కలర్‌ని పరిచయం చేస్తూ కథ మొదలౌతుంది. ఆరంభ సన్నివేశాలని లైటర్ వెయిన్‌లో తీసుకెళ్ళాడు దర్శకుడు. పెళ్లి పాట చాలా కళగా తీశారు. పెళ్ళికి ముందు వధువు, వరుడు చేసే పూజలు, పసుపు దంచడం వంటి సన్నివేశాలు చాలా కళాత్మకంగా చిత్రీకరించారు. ఫస్ట్ హాఫ్ తరువాత అసలు కాన్సెప్ట్ వస్తుంది.
అల్లుడికి జాబ్ పొయిందనగాన సదానందంలోని సగటు నాన్న బయటకు వస్తాడు. ఈ పెళ్లి మానసకి కూడా ఇష్టం వుండదు. దానికి గల కారణాలు చూపిస్తూ సెకండ్ హాఫ్ మొదలౌతుంది. ఇక సదానందం వేసే ఎత్తులు భళే ఉంటాయి. ఒకవైపు ప్రేమానురాగాలు, మరోవైపు జాలి, ఇంకోవైపు భావోద్వేగాలు, జాలి – ప్రేమ మధ్య తేడా చూపిస్తూ కొన్ని సన్నివేశాలు వస్తాయి. మానస రియలైజయ్యే సన్నివేశాలు ఎమోషనల్‌గా వుంటాయి.
చివరికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల వ్యవహరం, అందులో సాధకబాధకాలని ఈ సినిమాలో కనిపిస్తాయి. అదే సమయంలో సందేశాత్మక సన్నివేశాల సమాహారంతో ఓ ఫీల్ గుడ్ సినిమాలా ఈ కథని ముగించాడు దర్శకుడు.
Casting తారాగణం: సాయి రోనాక్ ఛార్మింగ్‌గా, నేచురల్‌గా నటించాడు. ప్రగ్యా నగారా అందంగా హుందాగా కనిపించింది. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, ఎల్బీ శ్రీరామ్, వడ్లమాని శ్రీనివాస్ వంటి సీనియర్లు పాత్రలకు న్యాయం చేశారు. సినిమాను పండించారు. తెలంగాణ మాండలికం పలకడానికి ఇబ్బంది పడి చాలా చోట్ల అసహజంగా అనిపిస్తుంది. ఆ యాస తెలిసిన నటీనటులని తీసుకొని వుంటే రిజల్ట్ ఇంకా బెటర్ గా వుండేది.
Technical Team సాంకేతిక బృందం : మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా వుంది. చరణ్ అర్జున్ స్వరపరిచిన పెళ్లి పాట, అప్పగింతల పాట ఆకట్టుకుంటాయి.