- అలసత్వం వహిస్తే అంతే సంగతులు!!
స్మార్ట్ ఫోన్ వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. షాపింగ్ చేయాలన్నా, చెల్లింపులు చేయాలన్నా, బ్యాంకు లావాదేవీలు చేయాలన్నా అన్నింటికి స్మార్ట్ ఫోన్‌నే వినియోగిస్తాం. మరి అలాంటి ఫోన్ సురక్షితంగా ఉందా? హ్యాకర్ల చేతిలో పడిపోయిందా? తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇవి వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాలి. మీకు ఆసక్తి ఉంటే ఈ వార్త మీకోసమే.
వాట్సాప్, ఫేస్బుక్, షేర్ చాట్, ఇన్స్టాగ్రామ్, టెలీగ్రామ్, ట్విట్టర్ (ఎక్స్) ఇలా ఎన్నో యాప్‌లను వయసులతో నిమిత్తం లేకుండా వినియోగిస్తున్నారు. సామాజికంగా ఇందులోనే జీవించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అంటే స్నేహితులు, బంధువులకు సమాచారాన్ని వీటి ద్వారానే చేరవేస్తారు. అలాగే పొందుతుంటారు. ఇదే హ్యాకర్లకు మంచి అదునుగా కనిపిస్తోంది. వాటినే వినియోగించి మీ జేబులు కొల్లగొడుతుంటారు. సమాచారాన్ని తస్కరిస్తుంారు.
ఎలా అంటే..
మీ సామాజిక మాద్యాలకు ఖాతాలకు ఏపీకే ఫ్రైళ్లు, టెక్స్ట్ మెసేజ్‌లు పంపించి ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుతారు. ఆకర్షణీయంగా ఉండడంతో వీటిని టచ్ చేస్తే వెంటనే స్పైవేర్, మాల్వేర్ వైరస్ కనిపించకుండానే ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. మన సమాచారం మొత్తం మిర్రర్ సిస్టంలో హ్యాకర్లకు చేరుతుంటుంది. ముఖ్యంగా ఫోన్లోని పోర్న్ సైట్ ద్వారా ఎక్కువగా ఇలాంటి హార్మ్ హ్యాకింగ్‌ను ఇలా తెలుసుకోవచ్చు.
మరి ఏం చేయాలి? ఎలా తెలుసుకోవాలి?
మన ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అంటే మన ఫోన్లోని డయలర్ ప్యాడ్‌ను ఓపెన్ చేసి *# 67# లేదా *# 21# లేదా *# 62# ను నొక్కితే ఎంఐఎం కోడ్ డిస్ప్లే అవుతుంది. ఇందులో అన్ని కాలమ్స్ నాబ్ ఫార్వెర్టెడ్ అని కనిపిస్తే మనఫోన్ సురక్షితంగా ఉన్నట్టు లెక్క. లేదంటే హ్యాకింగ్‌కు గురయ్యిందని అర్థం.
మరోవైపు మనఫోన్ను అపరిచిత వ్యక్తులకు ఇచ్చినప్పుడు వాళ్లు నిమిషం వ్యవధిలో మన ఫోన్లో ఏపీకేను ఇన్స్టాల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎవరికీ కనిపించని యాప్, ఫోన్‌ను హ్యాక్ చేసిన తర్వాత మొబైల్లోని కెమెరాసు, మైక్రోఫోన్‌ను మన ప్రమేయం లేకుండానే వినియోగించి మన వ్యక్తిగత వీడియోలు, ఫొటోలను సేకరిస్తారు. మొబైల్ యాక్సెస్‌లో లైవ్ లొకేషన్ ద్వారా మనం ఎక్కడ ఉన్నామో సులభంగా తెలుసుకుంటారు.
మరి దీన్ని గురించడం ఎలా అంటే కెమెరాను ఓపెన్ చేయగానే ఫోన్ పైభాగంలో గ్రీన్ డాట్ కనిపిస్తుంది. ఒకవేళ మెక్రోఫోన్ హ్యాక్ అయితే ఆరెంజ్ డాట్ కనిపిస్తుంది.
కింది దేశాల కోడ్ నుంచి వస్తే జాగ్రత్త!
మన దేశానికి సంబందించిన ఇంటర్నేషనల్ కోడ్ +91 ఉంటుంది. ఈ మధ్య స్మార్ట్ ఫోన్లకు + 92 ఇది పాకిస్తన్ది. + 44, +1, + 968 నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. వీటిని పొరబాటున లిఫ్ట్ చేస్తే మన ఫోన్ సులభంగా హ్యాక్ అవుతుంది. హ్యాకర్లు విదేశాలలో కూర్చునే మనపై వల విసుతారు. క్షణాల్లో మన ఫోన్లు హ్యాక్ చేస్తారు.
హ్యాకింగ్ నుంచి బయటపడడం ఎలా?
ఫోన్ హ్యాక్ కాకుండా మన స్మార్ట్ ఫోన్లో ముందు కీప్యాడ్‌పై ##002# నొక్కా లి. దీంతో హ్యాకర్ల బారిన పడకుండా మన ఫోన్ సురక్షితంగా ఉంటుంది. కెమెరా హ్యాక్ అయితే కెమెరా సెట్టిం గ్స్‌ను రీసెట్ చేసుకుని మెయిల్, పాస్ట్వర్డులను మార్చుకోవాలి. ముఖ్యంగా ఫోన్లోని యాప్ నోటిఫికేషన్లను పరిశీలించి అన్నింటి పర్మిషన్లు ఆపేయాలి.
ఫేస్ బుక్ హ్యాక్ అయితే ఫేస్బుక్ సెట్టింగ్స్ ప్రైవసీ సెట్టింగ్స్, పర్సనల్ సెక్యూరిటీ, వేర్ యూ ఆర్ లాగ్ ఇన్, లాగ్ అవుట్ చేసుకుని ఫేస్ బుక్‌ను డిలీట్ చేసి కొత్తగా ఇన్స్టాల్ చేసుకోవాలి. వాట్సాప్ హ్యాక్ అయితే పూర్తిగా ఫోన్‌ను ఫ్యాక్టరీ సెట్టింగ్సు చేసుకోవాలి.
కొత్త మెయిల్, పాస్‌వర్డులతో కొత్త ఫోనులా మళ్లీ ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆపై వాట్సాప్‌ను ఇన్స్టాల్ చేసి టూస్టెప్ అథెంటికేషన్ చేసుకోవాలి. ఇక మెయిల్ హ్యాక్ అయితే పూర్తిగా మెయిల్‌ను డిలీట్ చేసి కొత్త మెయిల్‌తో లాగిన్ అవ్వాలి. దీన్ని తెలుసుకోవాలంటే డీవైక్ డీటైల్స్‌లో గమనించాలి.