- భారీగా పడిపోయిన బ్యాంకు నిఫ్టీ
స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. నాలుగు రోజులుగా నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం 11.30 గంటల సమయానికి సెన్సెక్స్ 600 పాయింట్లు పతనమైయ్యింది. అలాగే నిఫ్టీ -50 కనీసం 250 పాయింట్లు పతనమైయ్యింది. ఇప్పటికే 24200 స్థాయికి కనీసం 50 పాయింట్లు దిగువకు చేరుకుంది.
ప్రైవేట్ రుణదాత ఇండస్ ఇండ్ బ్యాంక్ మరియు పవర్ కంపెనీ ఎన్టిపిసిలో రెండవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేశాయి. ఇక్కడ ఈ రెండు సంస్థల నివేదకలో తగ్గుదల కనిపించింది. నివేదికలు నిరాశజనకంగా ఉండడంతో ఆ తగ్గుదల మార్కెట్‌ను ముఖ్యంగా ప్రభావితం చేసింది.
ఇక బ్యాంకు నిఫ్టీ మొదట్లో 200 పాయింట్ల లాభపడ్డట్లు కనిపించినా మొదటి అరగంటలోనే అది 200 పాయింట్ల దిగువకు చేరుకుంది. తరువాత ఓ దశలో వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయింది. 11.30 గంటల సమయంలో దాదాపు 1000 పాయింట్లు కోల్పోయి 50550 ట్రేడ్ అవుతోంది.
కాగా ఈ రోజు కోల్ ఇండియా, జెఎస్ డబ్ల్యూ స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇండిగో, బిపిసిఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌పిసిఎల్, ఐడిబిఐ బ్యాంక్‌ల షేర్లు లాభపడ్డాయి.