
తిరుమలలో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. జూన్ 9, 2025 నాటికి మొత్తం 84,258 మంది భక్తులు స్వామివారి దర్శనం పొందారు. భక్తులు పెద్ద ఎత్తున తలనీలాలు (Tonsures) సమర్పించగా, మొత్తం 33,502 తలనీలాలు నమోదయ్యాయి.
హుండీ (Hundi) ద్వారా వచ్చిన ఆదాయం కూడా గణనీయంగా ఉంది. ఒక్క రోజులో హుండీ కానుకల ద్వారా రూ. 3.90 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం సర్వదర్శనం (Sarvadarshanam without SSD Tokens) కోసం భక్తులు 18 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్జి షెడ్ల వద్ద (NG Sheds) క్యూలైన్లు వేస్తున్నట్టు సమాచారం. Waiting compartments భర్తీ కావడంతో అధికారులు లైన్లు మరింతగా విస్తరిస్తున్నారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.